సీఎం మార్పు తథ్యం.. ఎప్పటి లోగా అంటే..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్పు తథ్యమని తెలంగాణ ఎమ్మెల్యే స్సష్టం చేశారు. ఆ ఆపరేషన్ కోసమే తెలంగాణ కొత్త ఇన్ ఛార్జీగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేట్టారని స్పష్టం చేశారు. మరికొద్ది మాసాల్లో ఈ సీఎం మార్పు ఉంటుందన్నారు. అలాగే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డికి అపాయింట్‌మెంట్ దొరకకుండా ఆయన కేబినెట్‌లోని మంత్రి కీలకంగా వ్యవహరిస్తున్నారని గుట్టు విప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్పు తథ్యమని తెలంగాణ ఎమ్మెల్యే స్సష్టం చేశారు. ఆ ఆపరేషన్ కోసమే తెలంగాణ కొత్త ఇన్ ఛార్జీగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేట్టారని స్పష్టం చేశారు. మరికొద్ది మాసాల్లో ఈ సీఎం మార్పు ఉంటుందన్నారు. అలాగే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డికి అపాయింట్‌మెంట్ దొరకకుండా ఆయన కేబినెట్‌లోని మంత్రి కీలకంగా వ్యవహరిస్తున్నారని గుట్టు విప్పారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇన్‌చార్జీ మారిందంటే ఇంకా మారేది సీఎం రేవంత్ రెడ్డేనని ఆయన స్పష్టం చేశారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ‘మిషన్ సీఎం చేంజ్’ టాస్క్‌ను మీనాక్షి నటరాజన్‌కు అప్పగించారని తెలిపారు. అయితే గతంలో తాను ఇదే విషయాన్ని స్పష్టం చేశానని ఆయన పేర్కొ్న్నారు. ఈ ఏడాది జూన్ నుంచి డిసెంబర్‌లోపు ముఖ్యమంత్రి మార్పు తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. కుంభకోణాలతోపాటు ఇతర ట్యాక్స్‌లపై కాంగ్రెస్ పార్టీలో కథలు, కథలుగా చెప్పుకొంటున్నారన్నారు. అయితే కేబినెట్‌లో కలహాలు నడుస్తున్నాయని తెలిపారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home