సొంత పార్టీపై తిరగబడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్సీ :తీన్మార్ మల్లన్న
సొంత పార్టీపై తిరగబడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్సీ
బీసీ కులగణనను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో కులగణన సర్వేను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే, కుల గణన చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కులగణన సర్వే చేపట్టినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 66 లక్షల 99 వేల 602 కుటుంబాల సమాచారం సేకరించామని, మొత్తం తెలంగాణలో 96.9 శాతం సర్వే పూర్తి చేశామని సీఎం పేర్కొన్నారు. డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి 36 రోజులు పట్టిందన్నారు. ఏడాదిలోపు సర్వేను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. దీనిపై సభ్యులతో చర్చించి సాయంత్రం ఈ నివేదికకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అయితే సొంత ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ నిప్పులు చెరిగారు.
చట్ట సభలో ప్రవేశపెట్టిన నివేదిక దొంగ లెక్కలు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు.కులగణన నివేదికను బీసీ సంఘాలు వ్యతిరేకించాలని తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు.అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన నివేదిక వాస్తవాలకు భిన్నంగా ఉందని.. ఈ సర్వే నివేదికలో 40 లక్షల మంది బీసీలను తగ్గించారని ఆరోపిస్తూ.. బీసీ కులగణ నివేదిక పత్రాలను ఎమ్మెల్సీ మల్లన్న లైవ్‌లోనే తగలబెట్టారు. దీనిపై ఆయన మాట్లాడుతూ..ఓట్ల లెక్కలతో పోల్చితే ఈ నివేదికలో అన్ని తప్పులే ఉన్నాయి.. ఇది పూర్తిగా దొంగ లెక్కలు అన్ని.. బీసీ ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన వీరికి లేదని.. ఈ నివేదికపై తాను నిరసన వ్యక్తం చేస్తున్నానని.. బీసీల లెక్కలను తక్కువ చేసి చూపించినందుకు నిరసనగా.. నివేదికను తాను తగలబెడుతున్నట్లు ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు.మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్ సైతం తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలనే అసెంబ్లీలో ప్రస్తావించారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే తప్పుల తడక అని కాంగ్రెస్ ఎమ్మెల్సీనే చెబుతున్నారని కేటీఆర్ గుర్తు చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home