Wednesday, 28 May 2025

*అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల*



 *అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల*

IVF మహిళ విభాగ్ ఆధ్వర్యంలో కొత్త పేట మోహన్ నగర్ కరెంట్ ఆఫీస్ దగ్గర నిర్వహించిన అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు.
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కన్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం గొప్పది అని ఆయన అన్నారు.
ఆకలి తీర్చడంలో వచ్చే ఆనందం వేరు అని ప్రతి అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపడుతున్న వారికి అభినందనలు తెలిపారు.
ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కొనసాగించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో IVF ప్రధమ మహిళ ఉప్పల స్వప్న గారు, మహిళ general secretary మంజుల గారు నళిని గారు, మనిమాల, పోల అర్చన, లలిత, సరిత, పద్మజ, సరిత, దాక్షాయణి తదితరులు పాల్గొన్నారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home