Thursday, 6 February 2025

హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఎనిమిదవ కార్యవర్గ సమావేశం, భద్రాచలలో.,

   హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఎనిమిదవ కార్యవర్గ సమావేశం, భద్రాచలలో.                                          హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ

ఆధ్వర్యంలో, తేదీ: 5- 2- 2025, రోజున, ఎనిమిదవ కార్యవర్గ సమావేశం, భద్రాచలం, శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి సన్నిధిలో', అధ్యక్షులు  శ్రీ సరాబు లక్ష్మణ్ గుప్తా గారి సారథ్యంలో, ఈరోజు బుధవారం, ఉదయం, 11 గంటలకు, సమావేశం ప్రారంభమైంది. ప్రధాన కార్యదర్శి శ్రీ కటకం శివకుమార్ గుప్తా, కోశాధికారి శ్రీ లింగా ప్రకాష్ గుప్తా, గత సంవత్సరపు అధ్యక్షులు శ్రీ ఎం  దయాకర్ గుప్తా, ఉపాధ్యక్షులు అడ్మినిస్ట్రేషన్ శ్రీ రేపాక వెంకటేశ్వర్లు  సహాయ ప్రధాన కార్యదర్శి శ్రీ కోకోల్ల సత్య గారు, కోశాధికారి శ్రీ చింతల్ ఘాట్ శ్రీరామ్ గారు, పి పిఆర్వో శ్రీ దేవత శ్రీనివాస్ గుప్తా గారు, కార్యక్రమానికి ముందు హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు, డాక్టర్ నీలా శ్రీధర్ ఒక తెలుగు కవితలు చదివారు. అధ్యక్షులు శ్రీ సరాబు లక్ష్మణ్ గుప్తా గారు వేదికపైకి మాజీ అధ్యక్షులను సగవురవంగా పూల వర్షం మధ్య వేదికపైకి ఆహ్వానించారు సబికులు చప్పట్లతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ఏకైక ఎమ్మెల్సీ వాసవి సేవ అధ్యక్షుడు సలహాదారు శ్రీ  బోగ్గారపు దయానంద్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వాసవి సేవా కేంద్రం పూర్వాధ్యక్షుడు సలహాదారు శ్రీ కొండ్లె మల్లికార్జున్ గారు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. వాసవి ప్రార్ధన డాక్టర్ నీలా శ్రీధర్ పాడారు.  అధ్యక్షులు శ్రీ సరాబు  లక్ష్మణ్ గుప్తా గారు అధ్యక్ష ఉపన్యాసం చాలా వివరంగా చెప్పారు. ప్రధాన కార్యదర్శి శ్రీ కటకం శివకుమార్ గుప్తా గారు నివేదికను సమర్పించారు. దుప్పట్ల పంపిణీ నివేదికను శ్రీ కూన గోపాలకృష్ణ సమర్పించారు. మాజీ అధ్యక్షు లు, శ్రీ కూర జయరాములుగుప్త, శ్రీ కొండ్లె మల్లికార్జున్ గుప్తా, శ్రీ అల్లాడి నాగభూషణం. శ్రీ కాసెట్టి పండు గుప్తా, శ్రీ రెడ్డిశెట్టి చంద్రశేఖర రావు. ఐపీపీ శ్రీ మేడం దయాకర్ గుప్తా. మహాసభ కార్యదర్శి శ్రీ అడ్డగుల్ల రామకృష్ణ గారు తదితరులు ప్రసంగించారు. ముఖ్య అతిథి రెండు తెలుగు రాష్ట్రాల ఏకైక ఎమ్మెల్సీ శ్రీ   దయానంద్ గుప్త గారు ప్రసంగిస్తూ 50 సంవత్సరాల నుండి ఈ హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అంచలంచెలుగా ప్రతి అధ్యక్షుడు ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నాడు ఇప్పటి అధ్యక్షుడు సరాబు లక్ష్మణ్ గుప్తా గారు రెండు కోట్ల 50 లక్షల అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు ఆయనని నేను అభినందిస్తున్నాను ఈ సంస్థ ద్వారా అన్నదాన కార్యక్రమాలు స్కాలర్షిప్లు కుట్టు మిషన్లు బియ్యం పంపిణీ పెన్షన్లు దహన సంస్కారాలకు విరాళం వైశ్య సంస్థలన్నీ ఎంతో గణనీయంగా ప్రజలకు సేవ  చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభకు ఐదు ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం ద్వారా శ్రీ కోలేటి దామోదర్ గుప్తా గారు శ్రీ గణేష్ గుప్తా గారు ఇప్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి శ్రీ కటకం శివకుమార్ గారు వందన సమర్పణ చేశారు.


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home