Thursday, 6 February 2025

ఏసీబీకి చిక్కిన ఫుడ్ సేఫ్టీ అధికారి కావ్య రెడ్డి.

 ఏసీబీకి చిక్కిన ఫుడ్ సేఫ్టీ అధికారి కావ్య రెడ్డి.             నాణ్యత లేని గోలి తయారు చేస్తున్నారని ఆరోపణలతో యజమాని నుండి లంచం డిమాండ్ చేసిన ఏలూరు ఫుడ్ సేఫ్టీ అధికారి, ఆఫీసర్ అటెండర్  ఏలూరు అవినీతి నిరోధక శాఖ అధికారులు వల్ల పని పట్టుకున్నారు. ఏలూరు అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ వి సుబ్బరాజు తెలిపిన వివరాల ప్రకారం... ఏలూరు మండలం కాట్లంపూడి గ్రామానికి చెందిన సాయి సుందర్ గోకుల్ అదే ప్రాంతంలో ఉన్న గోలి సోడా కంపెనీ పేరుతో గోలి సోడాను తయారు చేస్తు


న్నాడు గోలి సోడా తయారీలో అధికంగా రసాయనాలు వినియోగిస్తున్నట్లు గుర్తించామని ఏలూరు ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారి దొండపూడి కావ్య రెడ్డి, కార్యాలయ అటెండర్ పుల్లారావు గోగుల్ ఫోన్ చేసి చెప్పారు.                                               గోలి సోడా విక్రయాలు సాఫీగా సాగాలంటే రూపాయలు 25 వేల లంచం డిమాండ్ చేశారు. ఎట్టకేలకు ఫుడ్ సేఫ్టీ అధికారి కి రూ.20 వేలు, సహాయకుడికి రూ.2 వేలు ఇచ్చేందుకు గోకుల్ సిద్ధపడ్డాడు. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు డబ్బుల కోసం వేధించటంతో గోకుల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు మంగళవారం రాత్రి 8 గంటల 30 నిమిషాల సమయంలో లంచం సొమ్మును ఫుడ్ సేఫ్టీ అధికారి డి వెంకట కావ్య రెడ్డికి, పుల్లప్ప పుల్లారావుకు గోకుల్ కార్యాలయంలో అందించాడు అప్పటికి అవినీతి నిరోధక శాఖ అధికారులు వల్ల పని ఉండడంతో వెంటనే వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అడుగులోకి తీసుకున్నారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home