Saturday, 24 August 2024

వామ్ గ్లోబల్ కన్వెన్షన్ 2024 కు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక శాఖ మంత్రి టి. జి. భరత్

 వామ్ గ్లోబల్ కన్వెన్షన్ 2024 కు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక శాఖ మంత్రి టి. జి. భరత్



 హైద్రాబాద : ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆబుదాబిలో నిర్వహిస్తున్న గ్లోబల్ కన్వెన్షన్ 2024 సెప్టెంబర్ 15 కొరకు ఎన్నో ఏర్పాట్లు చేయబడుచున్నవని, వ్యామ్ దుబాయ్ నాయకులు, అబుదాబి నాయకులు రేయింబవళ్లు కష్టపడి ఎన్నో రకాలుగా విచ్చేసిన అతిథులకు ఇబ్బందులు కలగకుండా వసతి గాని భోజనాలు కానీ ఏర్పాట్ల విషయంలో రాజీ పడకుండా ప్రయత్నిస్తున్నారనిజాని, ఇట్టి సమావేశానికి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక శాఖ మాత్యులు టి జి భరత్ ముఖ్యఅతిథిగా విచ్చేయడానికి అంగీకరించారని ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ ఛైర్మన్ శ్రీ టీజీ వెంకటేష్ కూడా విచ్చేయుచున్నారని మీడియా కమిటీ చైర్మన్ కౌటికె విఠల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంతోమంది ప్రముఖ వైశ్యుల ప్రసంగాలు మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో రకాల తీర్మానాల కొరకు ప్రతిరోజు కూడాను ప్రయత్నాలు జరుగుచున్నవని, కార్యక్రమ నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఎంతో పగడ్బందీగా నిర్వహించడానికి భారతదేశంలోనే ప్రముఖ ఈవెంట్ ప్లానర్ శ్రేయస్ మీడియాను కోరగా వారు అంగీకరించి నిర్వహించడానికి ముందుకు వచ్చి ఎన్నో రకాలుగా వారి క్రియేటివిటీని చూపిస్తున్నారని పేర్కొన్నారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home