ACB Raid | లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ జలమండలి మేనేజర్ స్ఫూర్తిరెడ్డి
ACB Raid | లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ జలమండలి మేనేజర్ స్ఫూర్తిరెడ్డి. మణికొండ : మణికొండ మున్సిపాలిటీ జలమండలి మేనేజర్(Jalamandali Manager) లంచం తీసుకుంటూ పట్టుబడింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ద్వారా రూ. 30 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు (ACB Officials) రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు డివిజన్-18 మణికొండ మేనేజర్‌గా స్ఫూర్తిరెడ్డి విధులు నిర్వహిస్తున్నారు.మణికొండ మున్సిపాలిటీ (Manikonda Muncipality) నెక్నాంపూర్ వెంకటేశ్వర కాలనీకి చెందిన బొమ్మ ఉపేంద్రనాథ్‌రెడ్డి కొత్తగా భవనాన్ని నిర్మించుకున్నాడు. ఈ భవనానికి రెండు కొత్త నీటి కనెక్షన్‌లు(Tap Connections) తీసుకునేందుకు అధికారులను కోరాడు. దీంతో మేనేజర్ స్పూర్తిరెడ్డి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌గౌడ్ ద్వారా సదరు వ్యక్తి నుంచి రూ. 30 వేల లంచం డిమాండ్ చేశారు. అన్ని దస్తావేజులు సరిగ్గా ఉన్నా కనెక్షన్ ఎందుకు ఇవ్వరని బాధితుడు ప్రశ్నించాడు. డబ్బులు ఇస్తేనే నీటి కనెక్షన్‌కు అనుమతులు ఇస్తామని చెప్పడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
మంగళవారం జలమండలి మేనేజర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రూ. 30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులోఎదుట హాజరుపరిచామన్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే టోల్‌ఫ్రీ నెంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు తెలిపారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home