Sunday, 16 June 2024

టీటీడీ) కొత్త ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(ఈవో)గా ఐఏఎస్‌ అధికారి జె. శ్యామలరావు

 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(ఈవో)గా ఐఏఎస్‌ అధికారి జె. శ్యామలరావు


ఆదివారం(జూన్‌16) బాధత్యలు తీసుకున్నారు. సంప్రదాయం ప్రకారం ఆయన ముందుగా వరాహస్వామిని దర్శించుకుని అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి శ్యామలరావుకు ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. నూతన ఈవో దంపతులకు అర్చకులు ఆశీర్వదించారు. జేఈవోలు తీర్థప్రసాదాలు అందజేశారు.                                        సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తిరుమలలో శాస్త్రం ప్రకారం ఉంటుందన్నారు. తిరుమలలో ఎలాంటి అపవిత్ర ఘటనలు చోటుచేసుకోకుండా చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో టీటీడీ ఈవోగా శ్యామల రావును నియమించారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం కూడా సెలవు కావడంతో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home