వైఎస్ జగన్ ఇంటి నిర్మాణాల కూల్చివేత.. ఆమ్రపాలి సీరియస్.. జోనల్ కమిషనర్‌పై సస్పెండ్..!
వైఎస్ జగన్ ఇంటి నిర్మాణాల కూల్చివేత.. ఆమ్రపాలి సీరియస్.. జోనల్ కమిషనర్‌పై సస్పెండ్..!
Khairatabad Zonal Commissioner suspend: హైదరాబాద్ నగరంలోని వైఎస్ జగన్ ఇంటి ముందున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగన్ ఇంటి ముందు అక్రమంగా సెక్యూరిటీ పోస్టు నిర్మించారని ఫిర్యాదులు అందటంతో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. దీనిపై జీహెచ్ఎంసీ ఇంఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి సీరియస్ అయ్యారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ మీద బదిలీ వేటు వేశారు. ఆ బాధ్యతల నుంచి తొలగిస్తూ ఆదేశాలిచ్చారు. .YS Jagan House Illegal Constructions: హైదరాబాద్ నగరంలోని అక్రమ కట్టడాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన నిర్మాణాలను కూల్చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో ఉన్న ఏపీ మాజీ సీఎం, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ముందు ఉన్న అక్రమ కట్టడాలను కూడా అధికారులు కూల్చేశారు. ఈ కూల్చివేత అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారటంతో.. ఉన్నతాధికారులు ఎంట్రీ ఇచ్చారు. వైఎస్ జగన్ ఇంటి ముందు ఉన్న నిర్మాణాల కూల్చివేతపై జీహెచ్ఎంసీ ఇంఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి సీరియస్ అయినట్టు. లోటస్ పాండ్‌లోని వైఎస్ జగన్ నివాసం ముందు రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లుగా జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు అందాయి. ఫుట్‍పాత్ ఆక్రమించి జగన్ ఇంటి ముందు సెక్యూరిటీ పోస్ట్‌ల నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసుల ఆధ్వరంలో రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చేశారు. జేసీబీలతో సెక్యూరిటీ పోస్టులను పూర్తిగా నెలమట్టం చేశారు.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home