నటి హేమకు రిమాండ్, జైలుకు తరలింపు - కోర్టు బయట హైడ్రామా!
పోలీసులు హేమను కోర్టుకు తీసుకెళ్లగా అక్కడ హేమ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేం తప్పు చేయలేదని అన్నారు.
అయితే, పోలీసులు హేమను కోర్టుకు తీసుకెళ్లగా అక్కడ హేమ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేం తప్పు చేయలేదని.. మీడియా తనపై ఇప్పటిదాకా రాసినదంతా అబద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్త నమూనాలు, గోళ్లు, వెంట్రుకలు, యూరిన్ వంటి శాంపిల్స్ ను కాసేపటి క్రితమే సేకరించారని అన్నారు. ‘‘నేనేం తప్పు చేయలేదు. ఇప్పుడు నన్ను తీసుకొచ్చారు. అసలు నేను హైదరాబాద్ నుంచి ఆ వీడియో పంపాను. నన్ను ఎలా తీసుకెళ్తున్నారో సీసీబీ వారికి చెప్పాను. మందు తాగలేదు, బర్త్ డే కేక్ కట్ చేసి హైదరాబాద్ వచ్చాను. నేను మా ఇంటి నుంచి బిర్యానీ వీడియో అప్‌లోడ్ చేశాను’’ అని హేమ తెలిపారు.
కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో పోలీసులు ఆమెను పరప్ప అగ్రహార జైలుకు హేమను తరలించారు. అంతకుముందు కేసీ జనరల్ ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home