విద్యాసంస్థలు ప్రారంభం కాకముందే ఫీజుల రెగ్యులేషన్ కమిటీలను నియమించాలి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు విద్యాసంస్థల్లో ఇష్టరాజ్యంగా ఫీజులను వసూలు చేస్తూ ప్రజలను దోపిడీ చేస్తున్నారని దీనిని అరికట్టడానికి ప్రైవేటు విద్యాసంస్థలకు సంబంధించిన ఫీజులను నియంత్రణ చేసే రెగ్యులేషన్ కమిటీలను నియమించి దోపిడీని అరికట్టాలని సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ యర్రమాద కృష్ణారెడ్డి ఆదివారం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలలో ఎక్కువగా నిబంధనలు ఉల్లంఘన ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలు చేస్తున్నాయన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల ఏర్పాటు సమయంలో అనుమతి పొందే క్రమంలో ప్రభుత్వ విద్యాశాఖ నిర్దేశించిన విధంగా విద్యాశాఖ ఆదేశాలను,నిబంధనలను తూచ తప్పకుండా పాటిస్తామని అర్హత గల వారితో మెరుగైన విద్యా బోధన చేయిస్తామని, విశాలమైన క్లాస్ రూములు, క్రీడా ప్రాంగణాలు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలలో మౌలిక వసతులు కల్పిస్తామని చేప్పి విద్యార్థుల ను మోసం చేస్తున్నారని తెలిపారు.మెమోరియల్, సొసైటీ, ,ఫౌండేషన్ పేరుతో అనుమతులకు దరఖాస్తులు చేసుకుంటారని అనుమతులు పొందిన క్షణం నుండి విద్యాశాఖ ఆదేశాలను తుంగలో తొక్కి, నిబంధనలకు నీళ్లు వదిలి పక్కా వ్యాపారంగా దోచుకోవడానికి అనుమతులు ఇచ్చినట్టుగా విద్యాసంస్థలను అధిక లాభాలను ఆర్జించే వ్యాపారంగా నిర్వహిస్తున్నారని అన్నారు. సౌకర్యాల కల్పన విషయంలో నిర్లక్ష్యం, ప్రచారంలో ఆర్భాటం, ఆకర్షణీయమైన పేర్లతో స్కూల్ లకు పేర్లు పెట్టడం, ఫీజుల వసూల్ల విషయంలో ఒకరిని మించి ఒకరు పోటీపడి పడి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home