కొండగట్టు ఆలయ ఈవో వెంకటేష్ సస్పెన్షన్
కొండగట్టు ఆలయ ఈవో వెంకటేష్ సస్పెన్షన్
కొండగట్టు ఆలయ ఈవో టీ. వెంకటేష్‌ను సస్పెండ్ చేస్తూ ఎండోమెంట్ కమిషనర్ ఎం. హనుమంతరావు ఉత్తర్వులు వెలువరించారు.కొండగట్టు ఆలయ ఈవో టీ. వెంకటేష్‌ను సస్పెండ్ చేస్తూ ఎండోమెంట్ కమిషనర్ ఎం. హనుమంతరావు ఉత్తర్వులు వెలువరించారు. ఇటీవల టెంపుల్‌కు చెందిన టెండర్ల విషయంతో పాటు దుకాణాల లీజు డబ్బులకు సంబంధించి ఆర్థిక పరమైన అవకతవకలు జరిగిన నేపథ్యంలో ఈఓ పర్యవేక్షణ లోపం ఉండటంతో ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ విషయంలో ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ జ్యోతి ఆధ్వర్యంలో ఈ నెల 21న విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. అయితే సస్పెన్షన్ గురైన ఈవో వెంకటేష్ కరీంనగర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఉండాల్సిందిగా సూచించారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా కరీంనగర్ హెడ్ క్వార్టర్ వదిలి వెళ్లకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ సస్పెన్షన్ ఒక ఈవో తోనే ఆగుతుందా లేక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సూపరిండెంట్ స్థాయి అధికారులు విచారణ ఎదుర్కోక తప్పదా అని ఆలయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home