Wednesday, 23 March 2016

ఉరి తియ్యటానికి ఒక్కరొజుముందు భగత్ సింగ్ రాసిన లేఖ (22-03-1931)
కామ్రేడ్స్!
జీవించి ఉండాలి అన్న కొరిక నాకు లేదు అని చెప్పదలుచుకొలేదు. కాని జీవించడమంటు జరిగితే శాశ్వతంగా జైలు గొడల మద్య బందనాలలొ బ్రతకాలి అని నాకు లేదు.
ఈ రొజు నా పేరు హిందుస్తాన్ విప్లవ పార్టీకి పర్యయపదం గా తయరు అయింది. విప్లవ పార్టీ ఆశయాలు ,ఉజ్వల బలిదానాలు నన్ను అత్యున్నత స్తానం లొ నిలిపాయి. బహుశా నేను బ్రతికి ఉన్నా ఏప్పటికి అందుకొలేనంత ఏత్తుకి చెరుకున్నాను. ఇప్పుడు ప్రజల ద్రుష్టి లొ నేను బలహీనుడను కాదు. నేనే కనక ఉరి తప్పించుకుని బయటకు వస్తే ఆ బలహీనతలు బహిర్గతం కావచ్చు. విప్లవ కేంద్ర ప్రభావం పల్చపడవచ్చు .ముగిసిపొవచ్చు కూడా. నేను ధైర్యంగా నవ్వుతూ ఉరికంబం ఎక్కినట్టు అయితే దేశం లొ తల్లులు తమ పిల్లలని భగత్ సింగ్ కావాలి అని కొరుకుంటారు . తద్వారా దేశ దాస్య విముక్తి కొసం ఆత్మార్పణ చెసే మరెందరొ తయారు అవుతారు. సామరాజ్యా వాదం సర్వ శక్తులా పేనుగులాడినా విప్లవాన్ని అడ్డుకొలేని స్థితి వస్తుంది.
ఈ సమయం లొ ఒక బావన నాలొ తరచూ తలెత్తుతున్నది . దేశం కొసం, మానవాళి కొసం అనుకున్నదానిలొ సగం కూడా నేరవేర్చలేకపొయాను. నేను కనక ఒక వేల బ్రతికి ఉంటె ఇవన్ని పుర్తి చెయటానికి అవకాశం లబించేదేమొ. అప్పుడు నా ఆలొచనలు ఆచరణలొ పెట్టగలిగేవాడిని. ఈ ఒక్క కోరత తప్ప నా హ్రుదయం లొ ఉరి శిక్షను తప్పించుకొవాలి అని ఎలాంటి ప్రలొభము లేదు. నాకన్నా ఎక్కువ అద్రుష్టవంతులు ఎవరు ఉంటారు? ఇటీవల కాలం లొ నన్ను చూస్తే నాకే గర్వం కలుగుతొంది. ఆకరి పరిక్ష కొసం మనస్సు ఎంతొ ఆదుర్ధా గా నిరీక్షిస్తోంది. అది మరింత త్వరగా రావాలని కొరుకుంటుంది.
ఇక సెలవు
మీ సహచరుడు
భగత్ సింగ్
Inqulab Zindhabad

No comments:

Post a Comment