Saturday, 13 July 2024

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన శేరిలింగపల్లి ఎమ్మెల్యే

 

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన శేరిలింగపల్లి ఎమ్మెల్యే

 

కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ (MLA Arekapudi Gandhi) తన అనుచరులతో కలిసి హస్తం పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్‌ రెడ్డి వారికి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

MLA Arekapudi Gandhi | కాంగ్రెస్‌ పార్టీలో చేరిన శేరిలింగపల్లి ఎమ్మెల్యే

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ (MLA Arekapudi Gandhi) తన అనుచరులతో కలిసి హస్తం పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్‌ రెడ్డి వారికి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు శేరిలింగంపల్లి కార్పొరేటర్‌ నాగేందర్‌ యాదవ్‌, హైదర్‌నగర్‌ కార్పొరేటర్‌ నార్నె శ్రీనివాస్‌, మియాపూర్‌ కార్పొరేటర్‌ ఉప్పలపాటి శ్రీకాంత్‌, చందానగర్‌ కార్పొరేటర్‌ మంజుల రఘునాథ్‌ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరినవారిలో ఉన్నార

New SV 5కాగా, అరికెపూడి గాంధీ చేరికతో కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంఖ్య తొమ్మిదికి చేరింది. శుక్రవారం రాత్రి రాజేంద్ర నగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ కండువ కప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌, కాలె యాదయ్య, సంజయ్‌ కుమార్‌, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home