BRS కు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గుడ్ బై
నల్లగొండ : బీఆర్ఎస్ పార్టీకి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గుడ్ బై చెప్పారు. బుధవారం తన అనుచరులతో సమావేశమైన ఆయన కార్యకర్తల నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తన ముఖ్య అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన అందరి నిర్ణయం మేరకు ఈ ప్రకటన చేశారు. అలాగే ఆయనతో పాటు బీఆర్ఎస్కు ఆయన అనచరులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు కూడా రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. అయితే ఆయన కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నట్లుగా ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. అయితే ఆయన ఏ పార్టీలో చేసే విషయం అధికారికంగా ఆయన ఇంకా ప్రకటించలేదు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home