21న కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ ...భారీ ఏర్పాట్లు
తలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా నియామితులైన జి.కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 21 న రాష్ట్ర కార్యాలయంలో
కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు ఆ పార్టీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో బైక్ రాలి ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర కార్యాలయం వద్ద సభకు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. గతంలో కిషన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, తెలంగాణ లో ఒకసారి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇప్పుడు అధ్యక్షులు బాధ్యతలు తీసుకుంటే నాలుగోసారి అధ్యక్షుడిగా రికార్డుతో పాటు దేశంలోనే ఏ రాష్ట్ర అధ్యక్షుడికి దక్కని అరుదైన అరుదైన గౌరవం కిషన్ రెడ్డికి దక్కనుంది.

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home